: స్వాతంత్ర్య సమర యోధుల పింఛన్ రూ.15 వేలు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు


నాటి నాయకుల స్ఫూర్తి మనకు చైతన్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం, వాహనంపై మైదానంలో ప్రయాణించి పరేడ్ ను పరిశీలించారు. వేడుకలు తిలకించేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు.

అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలని, భారతదేశాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అల్లూరి సీతారామరాజు పేరు తలచుకుంటే ఇప్పటికీ ఆవేశం వస్తుందని అన్నారు. స్వాతంత్ర్య సమరయోథుల కుటుంబాలను గౌరవించడం మనందరి బాధ్యత అని, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ ను రూ.15 వేలు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News