: త్రివర్ణ ‘గూగుల్’ డూడుల్!
భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గూగుల్ సంస్థ డూడుల్ ను త్రివర్ణంలో పోస్ట్ చేసింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న పార్లమెంట్ భవనం, దానికి ఇరువైపులా మన జాతీయ పక్షి నెమలి, మధ్యలో అశోకచక్రంతో ఉన్న డూడుల్ ను తయారు చేశారు. ఈ డూడుల్ ను ముంబైకి చెందిన ఆర్టిస్ట్ సబీనా కార్నిక్ రూపొందించారు. గతంలోనూ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రకాల డూడుల్స్ ను ‘గూగుల్’ రూపొందించింది.