: అమ్మ కోరిక మేరకే కేన్సర్ ఆసుపత్రి నిర్మించాం: నందమూరి బాలకృష్ణ
తన తల్లి కోరిక మేరకే బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని నిర్మించామని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, బాలకృష్ణ మాట్లాడుతూ, కేన్సర్ బాధితులకు సేవలందిస్తున్న తమ ఆసుపత్రి ఎన్నో బహుమతులు అందుకుందని, పేద ప్రజలకు సేవ చేసేందుకు మారుమూల గ్రామాల్లోనూ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బాపూజీ సత్యాగ్రహ పోరాట విజయమే మనకు లభించిన స్వాతంత్ర్యం అని అన్నారు.