: కొండచరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో.. గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు!


హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగి బస్సులపై పడిన ప్రదేశం ఏ మాత్రం సురక్షితం కాదని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మండీ-పఠాన్ కోట్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించాల్సిందేననే నిర్ణయానికి అధికారులు వచ్చారు. కొండచరియలు విరిగి పడేందుకు అవకాశం ఉన్న మార్గాల్లో రాత్రిపూట సర్వీసుల్ని హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ రద్దు చేసింది.

కాగా, హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన బస్సుల ప్రమాదంలో కనీసం 46 మంది చనిపోగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. తీవ్రంగా దెబ్బతిన్న మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రమాదంలో చిక్కుకున్న బస్సుల్లో తమ బస్సు లేదని వోల్వో సంస్థ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News