: గాఢ నిద్రతో మెదడుకు కొత్త శక్తి వస్తుందట!
గాఢ నిద్ర తర్వాత మెదడు కొత్త శక్తిని సంతరించుకుంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఎన్ఆర్ఐ శాస్త్రవేత్త కరునేశ్ గంగూలీ పరిశోధనలో ఈ విషయం తేలింది. కంటి కదలికలు లేని ఎన్ఆర్ఈఎమ్ (నాన్ ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్) నిద్ర తర్వాత మెదడు పనితీరు అంతకుముందు కంటే ఎంతో మెరుగ్గా ఉంటుందని వెల్లడైంది. బ్రెయిన్ మెషీన్ ఇంటర్ ఫేజ్ (బీఎమ్ఐ) ద్వారా గాఢనిద్ర తర్వాత మెదడు పనితీరును విశ్లేషించారు. గాఢనిద్రలో మెదడు, నాడీ కణాలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాయని, తద్వారా నిద్ర లేచే సమయానికి కొత్త శక్తిని సంపాదించుకుని, ప్రభావవంతంగా పని చేస్తుందని ఆ పరిశోధనలో తేలింది.