: 'డేటా కీ ఆజాదీ' ఆఫర్.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రూ.70కే ఏడాదంతా అపరిమిత డేటా


స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌ముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ మొబైల్ త‌మ వినియోగ‌దారుల ముందు అద్భుత ఆఫ‌ర్‌ను ఉంచింది. ఈ రోజు నుంచి ఆగస్టు 16 మధ్యలో రూ.70 రూపాయ‌ల‌తో రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు ఉచితంగా అప‌రిమిత 2జీ డేటాను అందుకోవ‌చ్చ‌ని తెలిపింది. 'డేటా కీ ఆజాదీ' ఆఫర్ పేరుతో ఈ స‌దుపాయాన్ని అందిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌లో డేటా మాత్ర‌మే కాకుండా 56 రూపాయల టాక్‌ టైమ్‌ను కూడా అందుకోవ‌చ్చ‌ని పేర్కొంది.  ఇటీవ‌లే ఇదే కంపెనీ రూ.299 నెలవారీ రెంటల్‌ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, టెక్ట్స్‌, డేటాను అందించనున్నట్టు ప్రకటించిన విష‌యం తెలిసిందే. మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో మిగ‌తా కంపెనీలన్నీ పోటీలు ప‌డి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి.


  • Loading...

More Telugu News