: సిటీ కేబుల్ ఎండీ ఇంట చంద్రబాబు.. నవదంపతులను ఆశీర్వదించిన సీఎం!
సిటీ కేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు కుమార్తె వివాహం రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. సీఎం చంద్రబాబు బిజీగా ఉండటంతో ఈ పెళ్లికి హాజరుకాలేకపోయారు. దీంతో, చంద్రబాబు ఈ రోజు సాయిబాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా నవదంపతులు మేఘన-కౌశల్ కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, వారిని ఆశీర్వదించారు. చంద్రబాబు వెంట మంత్రి దేవినేని ఉమా, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఉన్నారు.