: టీమిండియా చేతిలో చిత్తుగా ఓడడంతో ఆవేదన వ్యక్తం చేసిన శ్రీలంక కెప్టెన్
శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. తమ జట్టు చిత్తుగా ఓడిపోవడంపై శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు. తన కెరీర్‌లో ఈ సిరీస్ ఎంతో కఠినమైన, చెత్త సిరీస్ అని ఆయన వ్యాఖ్యానించాడు. సిరీస్ మ్యాచుల్లో ఒకటి నాలుగు రోజుల్లో ముగియగా, మరొకటి మూడు రోజుల్లోనే ముగిసిందని ఆయన అన్నాడు. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోవడం తమ ఆటగాళ్లకి కష్టమేనని వ్యాఖ్యానించాడు. టీమిండియా బాగా రాణించిందని అన్నాడు. తమ అభిమానుల నుంచి తమకు వచ్చిన మద్దతు గురించి ఆయన మాట్లాడుతూ వారు తాము ఘోర పరాజయం చెందిన సమయంలోనూ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు.