: కార్తీ చిదంబరంకు సుప్రీంలో షాక్.. సీబీఐకి అనుకూలంగా తీర్పు!


మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి వ్య‌తిరేకంగా సీబీఐ వేసిన పిటిష‌న్‌పై సుప్రీం కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. అత‌ను దేశం విడిచి వెళ్లకుండా సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్‌ నోటీసుపై మద్రాస్‌ హైకోర్టు విధించిన స్టేపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. మ‌ద్రాసు హైకోర్టు లుకౌట్ నోటీసుపై విధించిన స్టే వ‌ల్ల కార్తీ విచార‌ణ‌ను త‌ప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని, ఆరోప‌ణ‌లను త‌ప్పుదోవ ప‌ట్టించే అవ‌కాశం ఉంద‌ని సీబీఐ సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్‌లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ ముందు కార్తీ హాజరుకాకపోవడంతో పాటు, కేసులో ముందస్తు బెయిల్‌ కూడా దాఖలు చేయకపోవడాన్ని గుర్తించింది. విచారణకు సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. 2007లో త‌న తండ్రి మంత్రిగా ఉండగా.. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు అక్రమంగా పెట్టుబడులు తరలించడానికి సహకరించార‌ని కార్తీపై సీబీఐ ఆరోపించింది.

  • Loading...

More Telugu News