: హాలీవుడ్ సినిమాను తలపిస్తున్న `టిక్ టిక్ టిక్` టీజర్... వీడియో చూడండి
భారతదేశంలో అంతరిక్ష యాత్ర, పరిశోధన నేపథ్యంలో వస్తున్న మొదటి చిత్రం `టిక్ టిక్ టిక్` టీజర్ విడుదలైంది. భారీ ఎఫెక్టులతో, అంతరిక్షం సన్నివేశాలతో, ఉత్కంఠ పరిచే కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్ర టీజర్ హాలీవుడ్ చిత్రాలను తలపిస్తోంది. ప్రపంచాన్ని కాపాడటానికి హీరో అంతరిక్షయాత్రకు వెళ్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రానికి శక్తి సుందర్ రాజన్ దర్శకత్వం వహించారు. ఇందులో నివేథ పేతురాజ్, ఆజిజ్ ఆరన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథలో లీనమైన ప్రేక్షకుడికి మధ్యలో చిరాకు తెప్పించకుండా ఉండేందుకు ఈ సినిమాలో పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు లాంటివి జొప్పించలేదని దర్శకుడు శక్తి తెలిపారు.