: కృష్ణుడి వేషం వేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ కొడుకు.. మరోసారి సందేశమిచ్చాడంటున్న ఫ్యాన్స్
కృష్ణాష్టమి సందర్భంగా తన కుమారుడికి కృష్ణుడి వేషం వేసినందుకుగానూ బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కొడుకు చదువుతున్న స్కూల్‌ని అభినందించాడు. తన తనయుడు కృష్ణుడి వేషం వేయగా తీసిన ఓ ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశాడు. అందులో ఆయన కుమారుడు మురళి ఊదుతున్నట్టు పోజిచ్చాడు. మతసామరస్యంపై సిద్దిఖీ చేస్తోన్న కృషిని ఆయన అభిమానులు అభినందిస్తున్నాడు. ఈ బాలీవుడ్ స్టార్ గతంలోనూ ఓ వీడియో రూపొందించి తాను 16.66 శాతం హిందువుని, 16.66 శాతం ముస్లింనని, 100 శాతం ఆర్టిస్ట్ నని పేర్కొని సందేశాన్నిచ్చిన విషయం తెలిసిందే.