: ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భారత్ నష్టపోతుంది: చైనా
డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో భారత్‌పై ప్రతిరోజు విమర్శలు చేస్తోన్న చైనా అధికార పార్టీ పత్రిక ‘గ్లోబల్‌టైమ్స్’ తాజాగా ఇరుదేశాల వాణిజ్య సంబంధాలపై ఓ కథనం ప్రచురించింది. చైనా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించాలని యోచిస్తోన్న ఇండియాను హెచ్చరించే ప్రయత్నం చేసింది. తమ దేశానికి చెందిన పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేముందు ఈ అంశాన్ని పరిశీలించాలని తెలిపింది.
భారత్ ఇలాంటి చర్యలకు దిగితే భారత్ నుంచి తమదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై కూడా అదనపు సుంకాలు విధిస్తామని చైనా పేర్కొంది. ఈ నిర్ణయాలతో తమకు అంతగా నష్టం ఉండబోదని, భారత్‌కు మాత్రం భారీగా నష్టం ఉంటుందని తెలిపింది. భారత్‌కు వాణిజ్యలోటు పెరుగుతోందని తెలిపింది. తమ దేశ సంస్థలు పెట్టుబడులు పెట్టకపోతే నష్టం భారత్‌కేనని చెప్పింది. భారత్‌లో జరుగుతున్న చైనా వస్తువుల బహిష్కరణ ప్రచారాన్ని చైనాకు చెందిన మరో మీడియా ప్రస్తావిస్తూ ఇటువంటివి జరిగితే చివరకు భారత్‌కు నష్టం తప్పదని పేర్కొంది. ఇండియన్లకు ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయని రాసుకొచ్చింది.