: ఈ సంఘటన కేసీఆర్ కు మాయనిమచ్చ అవుతుంది: టీడీపీ నేత మోత్కుపల్లి


నేరెళ్ల ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే అది సీఎం కేసీఆర్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. కులం పేరుతో దూషిస్తూ దళితులను కొట్టారని, మత్తు మందు ఇచ్చి వారిని చితకబాదారని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదని అన్నారు. ఈ ఘటనలో ఎస్ఐపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ నేరేళ్ల బాధితులు మీడియా ముందు ఇటీవల వాపోయారని, వారి ఆక్రందనలు మంత్రి కేటీఆర్ కు, స్థానిక ఎమ్మెల్యేకు పట్టవా? అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News