: చంద్రబాబు, బాలకృష్ణలిద్దరూ రోడ్ షో లోనే పాల్గొంటారు: మంత్రి సోమిరెడ్డి


నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఈ నెల 19న లేదా 20న సీఎం చంద్రబాబునాయుడు పాల్గొంటారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అదే విధంగా, హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ 16 వ తేదీన రోడ్ షో లో పాల్గొంటారని తెలిపారు. రెండు రోజులు రోడ్ షో లో పాల్గొనాల్సిందిగా బాలకృష్ణను కోరామని, అయితే, ఒక్క రోజు మాత్రమే పాల్గొంటానని చెప్పారని అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ లిద్దరూ రోడ్ షో లోనే పాల్గొంటారని తెలిపారు. ‘ఉపఎన్నిక ప్రచారం నిమిత్తం మంత్రులు, నేతలందరూ నంద్యాలలోనే తిష్ట వేశారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రచారానికి మంత్రులు పోలేదా?..మంత్రులు అయినంత మాత్రాన ప్రచారంలో పాల్గొనకూడదనేమి లేదే’ అని అన్నారు.

  • Loading...

More Telugu News