: మియాపూర్‌లో నాటు బాంబు పేలుడు... హోటళ‍్లు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన‍్లలో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో మెట్రో స్టేషన్‌కు సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ఈ రోజు పేలుడు సంభవించడం కలకలం రేపింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అక్కడ ఓ నాటు బాంబు పేలిందని నిర్ధారించారు. నాటు బాంబు పేలుడు ధాటికి స్థానికులు భయపడిపోయారు.క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ లతో డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఓ వైపు పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తుండగానే మరోవైపు ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడును దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోటళ‍్లు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన‍్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు.