: రేపటి నుంచి నోకియా 5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విక్రయాలు
భారత స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని రేపటి నుంచి నోకియా 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని దుకాణాల్లో విక్రయానికి ఉంచుతున్నట్లు చెప్పింది. మరోవైపు, ఇప్పటికే నోకియా 6 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమైన విషయం తెలిసిందే.
రేపటి నుంచి అందుబాటులోకి రానున్న నోకియా 5 ధర రూ. 12,499. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.2 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమొరీ, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఫీచర్లుగా ఉన్నాయి.