: నన్ను కాలుస్తాడంట.. ఉరితీస్తాడంట.. నా బట్టలు విప్పుతాడంట!: జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తనపై చేస్తోన్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన ఓ సభలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేత గుత్తుల సాయి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
‘నన్ను కాలుస్తాడంట... ఉరితీస్తాడంట.. నా బట్టలు విప్పుతాడంట’ అని చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు. జగన్ తన పదవికి ఎసరు పెడతాడనే అప్పట్లో వైఎస్సార్ జగన్ ను బెంగళూరుకి పంపారని అన్నారు. జగన్ ను తండ్రే భరించలేకపోయారని, ఇక రాష్ట్రప్రజలు ఎలా భరిస్తారని ప్రశ్నించారు. వైసీపీ ఉన్మాదపార్టీ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వయసు తన అనుభవం అంత కూడా లేదని అన్నారు.