: గుంటూరులో ‘సరైనోడు’ సినిమా పాటకి కేథరిన్ స్టెప్పులు... ‘రాములమ్మ’ పాటకి శ్రీముఖి డ్యాన్స్


ఈ రోజు గుంటూరులో ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వ‌చ్చిన సినీ నటి కేథరిన్‌, యాంకర్‌ శ్రీముఖి త‌మ అభిమానుల‌ను అల‌రించారు. ‘సరైనోడు’ సినిమాలోని పాటకు స్టెప్పులేసి కేథ‌రిన్ డ్యాన్స్ చేసి అల‌రించ‌గా, ‘ఒసేయ్ రాముల‌మ్మ’ సినిమాలోని పాట‌కు శ్రీముఖి స్టెప్పులేసి అభిమానులను ఉత్సాహ‌ప‌ర్చింది. గుంటూరుకు రావడం ప‌ట్ల త‌న‌కు చాలా సంతోషంగా ఉందని ఈ సంద‌ర్భంగా కేథరిన్ పేర్కొంది. అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీ తీసుకున్న ఈ అమ్మ‌డు.. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ లేని జీవితాన్ని ఊహించలేమని అంది. తాను నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోందని పేర్కొంది.  

  • Loading...

More Telugu News