: వైసీపీ నేతలు బాడీ మసాజ్ సెంటర్ పెట్టుకుంటే మంచిది: మంత్రి సోమిరెడ్డి
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు చొక్కా, మంత్రి ఆదినారాయణరెడ్డి నిక్కరు విప్పుతానంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ రోజు రోజుకీ దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడే విధానం మార్చుకోకపోతే నంద్యాల ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారని అన్నారు. ఎప్పుడూ చెడ్డీలు, చొక్కాలు విప్పుతామంటున్న వైసీపీ నేతలు బాడీ మసాజ్ సెంటర్ పెట్టుకుంటే మంచిదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉపఎన్నిక రోడ్ షోలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ పాల్గొంటారని, టీడీపీ, బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. ఉపఎన్నిక ప్రచారంలో రెండు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తారని చెప్పారు.