: తమ శత్రుదేశాలకు పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడి హెచ్చరిక
పాకిస్థాన్ ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు కమర్ జావేద్ బజ్వా మాట్లాడుతూ... తమ శత్రుదేశాలకు హెచ్చరికలు చేశారు. దేశం ఏదైనా వారి బుల్లెట్లు అయిపోవాలే తప్ప తమ సైనికుల గుండెల్లోకి మాత్రం అవి వెళ్లలేవని అన్నారు. ఏ శక్తికూడా తమ లక్ష్యాన్ని బలహీనపర్చలేదని అన్నారు. తమకు వ్యతిరేకంగా చేసే ఎటువంటి ప్రయత్నాలనైనా తమ దేశ సైన్యం విఫలం చేస్తుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా తమ దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ఆయన అన్నారు. తమ దేశానికి ఎదురవుతున్న సవాళ్లను జాతీయవాద భావంతో అధిగమిస్తూ దూసుకుపోతామని వ్యాఖ్యానించారు. తమ దేశం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, వారి త్యాగాలను మర్చిపోలేమని అన్నారు.