: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సూపర్ కంప్యూటర్!


స్పేస్ బార్న్ కంప్యూటర్ గా పిలిచే సూపర్ కంప్యూటర్ ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ నుంచి ఈ రోజు ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకుగాను, ఫాల్కన్ 9 రాకెట్ ను స్పేస్ ఎక్స్ ప్రయోగించనుంది. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఐఎస్ఎస్ లో వ్యోమగాములకు భవిష్యత్ ప్రయోగాలపై మార్గనిర్దేశనం చేయనుందని అన్నారు. మానవరహిత కార్గోషిప్ లో దీన్ని ఐఎస్ఎస్ కు పంపనున్నామని, ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఈ ప్రయోగాన్ని వచ్చే వారానికి వాయిదా వేయనున్నట్టు చెప్పారు. కాగా, హెచ్ ఎంటర్ ప్రైజెస్ రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్ ని ఐఎస్ఎస్ లో ఓ ఏడాది పాటు పరీక్షించనున్నారు. 

  • Loading...

More Telugu News