: అంటార్కిటికా కింద 100 అగ్నిపర్వతాలు?
మంచుతో నిండి ఉన్న అంటార్కిటికా ఖండం కింద 2 కి.మీల లోతులో వందకు పైగా అగ్నిపర్వతాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అంటార్కిటికా కింద దాదాపు 4000 మీటర్ల ఎత్తున్న అగ్నిపర్వతాలు వందకు పైగా ఉన్నట్లు తెలియజేశారు. `మంచు కింద అగ్నిపర్వతాలు ఉంటాయని తెలుసు, కానీ ఇంత మొత్తంలో ఉంటాయని మేం ఊహించలేదు` అని శాస్త్రవేత్త రాబర్ట్ బింగ్‌హమ్ తెలిపారు.
దీంతో అంటార్కిటికా మొత్తం మీద చూస్తే ఇంకా చాలా అగ్నిపర్వతాల జాడలు కనిపించే అవకాశముందని రాబర్ట్ అభిప్రాయపడ్డారు. వీటిలో ఏ ఒక్క అగ్నిపర్వతం బద్దలైనా అక్కడి మంచు మొత్తం కరిగి సముద్ర మట్టాలు పెరిగే అవకాశముందని, తద్వారా కొన్ని ద్వీపాలు నామరూపాల్లేకుండా తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.