: వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ప్రిన్స్ మహేష్ అభిమానుల మద్దతు!


మరో వారం రోజుల తరువాత జరిగే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు మద్దతు పలికారు. ఈ ఉదయం నంద్యాలకు వచ్చిన వైకాపా నేత, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కృష్ణ, మహేష్ బాబు అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శిల్పాకు మద్దతివ్వాలని ఆయన కోరగా, నేటి నుంచి శిల్పా తరఫున జరుగుతున్న ప్రచారంలో తాము పాల్గొంటామని అభిమాన సంఘం ప్రతినిధులు ఆదిశేషగిరిరావుకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ఇరు పక్షాల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News