: నాలుగడుగుల దూరంలో భారత క్రికెట్ చరిత్రలోనే అద్భుత రికార్డు... లంక స్కోరు 121/6!


ఎనిమిదిన్నర దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ సాధ్యం కాని రికార్డు మరో నాలుగడుగుల దూరంలో ఉంది. విదేశాల్లో భారత జట్టు ఇంతవరకూ ఒక్క టెస్టు సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయలేదన్న సంగతి తెలిసిందే. ఇక తాజా శ్రీలంక సిరీస్ లో మూడు మ్యాచ్ ల సిరీస్ లో రెండు మ్యాచ్ లను గెలుచుకున్న భారత్, మూడో టెస్టులో విజయానికి మరింత దగ్గరైంది. నేడు లంచ్ విరామం తరువాత లంక బ్యాట్స్ మెన్లు వరుసగా పెవీలియన్ దారి పడుతున్నారు. భారత్ చేసిన 487 పరుగుల తొలి ఇన్నింగ్స్ కు బదులుగా 135 పరుగులకు తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయి, ఆపై రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. 35 పరుగులు చేసి కాస్తంత నిలదొక్కుకున్నట్టు కనిపించిన మ్యాధ్యూస్ 118 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీ రూపంలో పెవీలియన్ కు చేరాడు. మరో నాలుగు వికెట్లను తీస్తే, భారత్ టెస్టు సిరీస్ ను క్లిన్ స్వీప్ చేస్తుంది.

  • Loading...

More Telugu News