: ఇన్ఫోసిస్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగికి కృతజ్ఞతలు తెలియజేసిన సీఈఓ సిక్కా... ట్వీట్లో వెల్లడి
వివిధ కంపెనీలను విలీనం చేస్తూ ఇన్ఫోసిస్‌ను ముందుకి తీసుకెళ్లడానికి సంవత్సరాలుగా కష్టపడుతున్న ఉన్నత స్థాయి ఉద్యోగి దీపక్ పడాకీకి, ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని నెలలుగా చాలా మంది ఉన్నత స్థాయి ఉద్యోగులు ఇన్ఫోసిస్ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ హెడ్‌గా పనిచేస్తున్న దీపక్కి సోషల్ మీడియా ద్వారా స్వయంగా విశాల్ సిక్కా కృతజ్ఞతలు తెలియజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
`కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ దీపక్. 9200 రోజులుగా నువ్వు కంపెనీ కోసం పనిచేస్తున్నావ్! ప్రతిరోజు నీకు వీలైనంత కృషి చేశావ్!` అని విశాల్ ట్వీట్ చేశారు. 1992లో మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి కాగానే దీపక్ పడాకీ ఇన్ఫోసిస్‌లో చేరాడు. అప్పటి నుంచి 25 ఏళ్లుగా తన సేవలు అందిస్తూనే ఉన్నాడు.