: నాడు కసబ్ ఉన్న గదే మాల్యాకు... లండన్ కోర్టుకు చెప్పిన భారత్
ఇండియాలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి, బ్రిటన్ పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను తిరిగి వెనక్కు రప్పించే ప్రయత్నాల్లో ఉన్న భారత్, ఆయన్ను తెస్తే, ఉంచాల్సిన జైలు గురించిన వివరాలు, అక్కడి సౌకర్యాలు, భద్రతపై లండన్ కోర్టుకు వివరాలు అందించింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 26/11 పేలుళ్ల కీలక దోషి కసబ్ ను ఉంచిన గదిని మాల్యా కోసం సిద్ధం చేశామని, బ్యారక్ 12లో ఏర్పాట్లు చేశామని, మాల్యాకు అవసరమైన భద్రతా ప్రమాణాలను ఈ జైలు కలిగివుందని లండన్ కోర్టుకు కేంద్రం ఓ నివేదికను పంపింది. మాల్యా అప్పగింత కేసుపై ప్రస్తుతం వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం నివేదికతో ఆయన అప్పగింత మరింత త్వరగా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.