: పార్టీ కంటే కులమే గొప్ప!: స్వామి గౌడ్
పార్టీ కంటే కులమే ముఖ్యమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 367వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీల కంటే కులం ప్రధానం, పార్టీల కంటే జాతి ముఖ్యం, జాతి కోసం పోరాటం చేస్తే పది కాలాల పాటు మనల్ని గర్వపడేలా గౌరవిస్తదని అన్నారు. 'జై గౌడ' ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే గౌడలందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన హితవు పలికారు. సర్దార్ సర్వాయి పాపన్నను గౌడలంతా ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 18న ప్రతి గ్రామంలో సర్వాయి పాపన్న జయింతిని ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.