: నా కూతురిని కిడ్నాప్ చేయబోయారు... ఇప్పటివరకూ ఎవరితోనూ పంచుకోని విషయాన్ని చెప్పిన కమలహాసన్!
తన ఇంట్లో పనిచేస్తున్న వారే, తన కుమార్తెను కిడ్నాప్ చేయబోయారని, ఈ విషయాన్ని తాను ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోలేదని దక్షిణాది స్టార్ హీరో కమలహాసన్ వ్యాఖ్యానించారు. తాజగా ఓ ఇంటర్వ్యూలో ఆయన, 1994 నాటి బ్లాక్ బస్టర్ మూవీ 'మహానది'కి ప్రేరణగా నిలిచిన ఘటను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తన కుమార్తెలు పెద్దవాళ్లయ్యారు కాబట్టి, తాను ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నానో, అలానే వారూ అర్థం చేసుకుంటారన్న ఆలోచనతోనే ఈ విషయాన్ని బయట పెడుతున్నట్టు చెప్పారు.
ఓ కొత్త కథ తయారు చేసుకోవాలని తాను భావిస్తున్న వేళ, పనివాళ్లు తన బిడ్డను కిడ్నాప్ చేయాలని చూశారని, అదృష్టవశాత్తూ వారి మోసం గురించి తెలుసుకున్న తాను కాపాడుకోగలిగానని తెలిపారు. వారిని చంపేయాలన్నంత కోపం వచ్చిందని, ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యమనిపించి ఆగిపోయానని అన్నారు. కూతురి విషయంలో కలిగిన భయమే మహానది కథగా మారిందని చెప్పుకొచ్చారాయన.