: ఒన్ అండ్ ఓన్లీ దాసరి...ఇప్పుడెవరూ లేరు: శివాజీ రాజా
సినీ పరిశ్రమలో సమస్యలు పరిష్కరించే పెద్దలు లేరని శివాజీ రాజా చెప్పాడు. గతంలో సినీ పరిశ్రమలో ఏవైనా సమస్యలు ఏర్పడితే పరిశ్రమలో ఒక పెద్దగా రామానాయుడు మాటసహాయం చేసేవారని అన్నాడు. అయితే దాసరి నారాయణరావు అలా కాదని, ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే వారని అన్నారు. ఆయన దగ్గరకు ఏ సమస్య వెళ్లినా దానిని పరిష్కరించేంత వరకు విశ్రమించే వారు కాదని అన్నారు.
సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఆయన వద్దకే వెళ్లేవారని ఆయన చెప్పారు. సినీ కుటుంబపెద్దగా ఆయన రెండు వర్గాలను వెనకేసుకొచ్చేవారని, రెండు వర్గాలకు న్యాయం చేసేవారని ఆయన తెలిపారు. ఆయన మహానుభావుడని, ఆయన తరువాత సినీ పరిశ్రమలో ఆ స్థానంలో ఎవరూ లేరని చెప్పారు. తాను మా అధ్యక్షుడయ్యేందుకు కూడా ఆయన సహాయం చేశారని శివాజీ రాజా తెలిపాడు.