: రైల్లో దోపిడీకి గురైన ఏపీ మంత్రి శిద్ధా బంధువులు


ఆంధ్రప్రదేశ్ ఆటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు బంధువులు శబరి ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి గురయ్యారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నుంచి తిరువనంతపురం బయలుదేరిన శబరి ఎక్స్ ప్రెస్ లో శిద్ధా బంధువులు ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నారు. మంత్రి ఇంట జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వీరు దిండిగల్ బయలుదేరగా, సేలం సమీపంలో బోగీలోకి దూసుకొచ్చిన దొంగలు, వీరి లగేజీతో పాటు 40 తులాల బంగారు నగలను, స్మార్ట్ ఫోన్లనూ దోచుకెళ్లారు. ఇదే రైలులోని మరో బోగీలోని ప్రయాణికుల వద్ద 11 తులాల బంగారం, రూ. 7,500 నగదు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో సేలం, ఈరోడ్ రైల్వే పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News