: ఎస్సై ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ఎందుకు? ఎక్కడికి? తీసుకెళ్లాడని దర్యాప్తు చేస్తున్న పోలీసులు!
హైదరాబాదు సమీపంలో హిమాయత్ సాగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్సై ఖలీల్ తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై ఖలీల్ మహిళా కానిస్టేబుళ్లు కీర్తి, మమతలను ఆ సమయంలో ఎక్కడికి? ఎందుకు? తీసుకెళ్లాడని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై ఖలీల్ కు, కానిస్టేబుల్ కీర్తికి గల సంబంధాలపై ఆరాతీస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎస్సై ఖలీల్ ఘటనాస్థలిలోనే మృతిచెందగా, కీర్తి చికిత్స పొందుతూ మృతి చెందింది.
వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిసినట్టు సమాచారం. తీవ్రగాయాలపాలైన మమతకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసు, వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో వివరాలు తెలియాలంటే మమత నోరు విప్పాలని, లేని పక్షంలో ఏం జరిగిందో తెలియడం కష్టమని వారు చెబుతున్నారు.