: బుర్కినాఫాసోలో మరోసారి చెలరేగిన ఉగ్రవాదులు.. రెస్టారెంట్‌లో కాల్పులు.. 17 మంది మృతి
ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బుర్కినాఫాసోలోని ఓ టర్కిష్ రెస్టారెంట్‌పై కాల్పులు జరిపారు. కనీసం 17 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. రెస్టారెంట్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం గత రెండేళ్లలో ఇది రెండోసారి. కాల్పులు ఘటన తెలిసిన వెంటనే భద్రతా దళాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టాయి.
సోమవారం తెల్లారుజాము వరకు ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగాయి. అయితే కాల్పుల ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఉగ్రవాదుల కాల్పుల్లో 17 మంది మరణించగా మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచార శాఖామంత్రి రెమి డంజినో తెలిపారు. మరణించిన వారంతా వివిధ దేశాలకు చెందిన వారని వివరించారు. వారిలో ఓ ఫ్రెంచ్ జాతీయుడు కూడా ఉన్నట్టు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న బుర్కినాఫాసోలో ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటి.