: ఇక నీటి శుభ్రతను తెలుసుకోవచ్చు
మనం తాగే నీళ్ళలో పలు బాక్టీరియా ఉంటాయి. కానీ ఈ విషయం మనకు తెలియదు. నీటిలో కంటికి కనిపించని బాక్టీరియా గుట్టు రట్టు చేసే బయో సెన్సర్‌ను అభివృద్ధి చేసి అవార్డు గెలుచుకున్నాడు భారత సంతతికి చెందిన విద్యార్ధి నిస్సార్ పటేల్. ఇతను నీటిలో వుండే బ్యాక్టీరియాను పరిశీలించే హైడ్రోజీన్ బయోటెక్నాలజీకి సహ వ్యవస్థాపకునిగా ఉన్నాడు. వీరి బృందం నీటిలో వుండే ఒక బ్యాక్టీరియా నుండి బయో సెన్సర్‌ను తయారు చేసి దానిని వృద్ధి చేశారు. ఈ సెన్సర్‌ను నీటిలో కరిగే చక్కెర లాంటి పదార్ధాల్లో ప్రవేశపెట్టారు. నీటిలో చక్కెర వేయగానే ఈ సెన్సర్ ఏదైనా బ్యాక్టీరియాను తాకినట్లైతే ఆ నీరు వెంటనే ఎరుపు రంగులోకి మారుతుంది. అంటే ఆ నీటిని తాగవద్దని హెచ్చరిక మనకు దీనిద్వారా తెలుస్తుంది. ఇందుకుగాను అరిజోనా రాష్ట్ర విశ్వవిద్యాలయం పటేల్‌కు అవార్డును అందజేసింది.