: మళ్లీ నోరు పారేసుకున్న జగన్.. సీఎం చొక్కా, మంత్రి నిక్కరు విప్పుతానన్న ప్రతిపక్ష నేత!


నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు నోరు పారేసుకున్నారు. మరో రెండేళ్లు ఆగితే ముఖ్యమంత్రి చంద్రబాబు చొక్కా, మంత్రి ఆదినారాయణ రెడ్డి నిక్కరు విప్పుతానని అన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డి స్కూల్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.850 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారని ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా ఆయన ఎగ్గొట్టారన్నారు. ఈ విషయంలో  సీబీఐతో విచారణ జరిపించాల్సిన చంద్రబాబు తాను చెప్పిన మాట వినే సీఐడీ విచారణకు ఆదేశించారని విమర్శించారు. దీని వెనక మంత్రి ఆదినారాయణరెడ్డి హస్తం ఉందన్నారు. మరో రెండేళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రభుత్వమే అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులకు డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. అప్పుడు సీఎం చంద్రబాబు చొక్కా, మంత్రి ఆదినారాయణరెడ్డి నిక్కరు విప్పుతామని హెచ్చరించారు.
 

  • Loading...

More Telugu News