: బిగ్‌బాస్ హౌస్ నుంచి కల్పన ఎలిమినేట్.. నటుడు నవదీప్ ఎంట్రీ
ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోకు కొత్త అందం వచ్చింది. ఆదివారం కల్పన ఎలిమినేట్ కావడంతో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా టాలీవుడ్ నటుడు నవదీప్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. నిజానికి శనివారమే నవదీప్ హౌస్‌లోకి ఎంటరవుతాడన్న వార్తలు వచ్చాయి. అయితే ఆదివారం ఆయన హౌస్‌లోకి వచ్చి మిగతా సభ్యులతో చేరాడు. నవదీప్ చేరికతో బిగ్‌బాస్‌కు మరింత క్రేజ్ పెరిగినట్టు అయింది. కాగా, చిత్ర పరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ కేసులో నవదీప్ కూడా సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హౌస్‌లో ఉన్న ముమైత్ ఖాన్ కూడా ఇదే కేసులో సిట్ విచారణకు హాజరైంది.