: పవన్ కల్యాణ్‌తో చిన్న భేదాభిప్రాయం వచ్చిన మాట నిజమే!: సురేష్ బాబు
‘గోపాల గోపాల’ సినిమా తీసేటప్పుడు పవన్ కల్యాణ్‌తో తనకు చిన్న భేదాభిప్రాయం మాత్రమే వచ్చిందని, అదేమీ పెద్ద గొడవేమీకాదని నిర్మాత సురేష్ బాబు అన్నారు. ఈ రోజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని అన్నారు. పవన్ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నాడని, ఆయన సమాజంలో ఏదో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లోకి పలు రంగాల నుంచి ఎంతో మంది వస్తారని, కొందరు విజయం సాధిస్తారని, కొందరు సాధించలేకపోతారని అన్నారు. పవన్ కల్యాణ్ విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో ఉన్నవారు అన్ని ప్రభుత్వాల సపోర్టు ఉండాలని కోరుకుంటారని అన్నారు. సినిమా పరిశ్రమకు అధికారంలో ఉండే వారితో పనులు ఉంటాయని అన్నారు.