: మాస్టారూ ట్రంప్ గారూ... మీకో దండం!: హీరో నిఖిల్ వ్యంగ్యం
ఉత్తరకొరియా దుందుడుకు చర్యలు మానుకోవాలని లేదంటే ఆ దేశంతో పోరాడేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ట్వీట్‌పై స్పందిస్తూ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ట్వీట్ చేసి, అందరి దృష్టినీ ఆకర్షించాడు. పూర్తిస్థాయి అణుయుద్ధం ప్రారంభించడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకోవచ్చని తాను అస్సలు అనుకోలేదని పేర్కొన్నాడు. మాస్టారూ ట్రంప్ గారూ.. మీకో దండం అని పేర్కొన్నాడు. నిఖిల్ ట్వీట్ పై ఆయన అభిమానులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ట్రంప్ వల్ల మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమై మనందరి ఫొటోలకి దండలు పడతాయేమో? అంటూ వాపోతున్నారు.