: భూ వ్యవహారంలో జోక్యం.. సైబరాబాద్ పోలీసు అధికారులపై కేసు నమోదు!
భూ వ్యవహారంలో బలవంతంగా చెక్కులపై సంతకాలు పెట్టించారన్న ఆరోపణలతో హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నలుగురు పోలీస్ అధికారులపై ఈ రోజు సంబంధిత అధికారులు కేసులు నమోదు చేశారు. బాధితులు సైబరాబాద్ సీపీని ఆశ్రయించడంతో ఈ నలుగురు పోలీసుల బాగోతం బయటపడింది. రాయదుర్గం సీఐ దుర్గ ప్రసాద్, సైబరాబాద్ అదనపు డీసీపీ పులిందర్, ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ పై కేసు నమోదు చేయాలని మాదాపూర్ ఏసీపీని సీపీ సందీప్ శాండిల్య ఆదేశించడంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.