: పాకిస్థాన్‌కు ఇండియా మ్యూజిక్ బ్యాండ్ స్వాతంత్ర్య దినోత్సవ కానుక!
పాకిస్థాన్ రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ గీతాన్ని పాడి భారత్‌కు చెందిన ఓ మ్యూజిక్ బ్యాండ్ కంపెనీ యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసింది. సోలో గా పాడిన ఆ గీతం యూట్యూబ్ లో భారతీయులను అలరించి పాక్‌లోనూ పాప్యులర్ అవుతోంది. ఈ గీతాన్ని ఏడుగురు వ్యక్తులు పాడారు. ఈ వీడియోను చూస్తోన్న నెటిజన్లు ఆ మ్యూజిక్ బ్యాండ్ ను కొనియాడుతున్నారు. పాకిస్థానీ మీడియా కూడా ఈ వీడియోను ప్రశంసించింది. ఈ వీడియోలోని పాటను మీరూ వినండి...