: అనుమానంతో భార్యను చంపిన భర్త
భార్యపై పెంచుకున్న అనుమానంతో ఓ భర్త దారుణ ఘటనకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి చెందిన మహబూబ్, షకీరాబాను (28) ఉపాధి నిమిత్తం కర్ణాటకలోకి గౌరీబిదనూరుకు వెళ్లారు. భార్యపై తరచూ అనుమానం వ్యక్తం చేసే మహబూబ్ ఈ రోజు తెల్లవారు జామున ఆమె గొంతునులిమి హత్య చేశాడు. ఆ తరువాత తన పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. గతంలో మహబూబ్, షకీరాబాలకు గొడవ జరగగా పెద్దలు పంచాయితీ చేసి నచ్చజెప్పారు. అయినప్పటికీ ఆయన మారలేదు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు, ఏడాదిన్నర కుమార్తె ఉన్నారు.