: నంద్యాల ఉప ఎన్నికలో పవన్ కల్యాణ్ మద్దతు మాకే: భూమా మౌనిక


భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌రిలో తెలుగుదేశం పార్టీ నుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పోటీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై భూమా నాగిరెడ్డి చిన్న‌ కూతురు భూమా మౌనిక ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జ‌నసేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంటుంద‌ని అన్నారు. పవ‌న్ మొద‌టినుంచి త‌మ కుటుంబానికి సన్నిహితుడేన‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ త‌ల్లిదండ్రుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని అన్నారు. అలాగే త‌మ‌కు కూడా మ‌ద్ద‌తు ఇస్తార‌ని ఆమె చెప్పారు. 

  • Loading...

More Telugu News