: రాజకీయాల్లో ప్రవేశించాలనే ఉద్దేశంతోనే ముందుగా సినిమాల్లోకి వచ్చాను!: సినీ నటుడు ఉపేంద్ర


కన్నడ సినీన‌టుడు ఉపేంద్ర తాను రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాను ఎందుకు రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్నారో తెలిపారు. అస‌లు తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతోనే మొద‌ట‌ సినీరంగంలోకి వ‌చ్చాన‌ని అంటున్నారు. తాను రాజ‌కీయాల్లోకి రావాల‌న్న కోరిక‌కు త‌న‌ చిన్నతనంలోనే బీజం పడిందని చెప్పారు. త‌న‌లో విప్లవభావజాలాలు ఉన్నాయ‌ని అన్నారు. కానీ, త‌ను చెప్పే మాట‌లు ఎవ్వరూ  వినిపించుకునే వాళ్లు కాదని అన్నారు.

దీంతో త‌న ఆలోచనలని అంద‌రికీ చెప్పడానికి ఓ బలమైన మాధ్యమం అవసరమైందని, అందుకే సినిమా రంగంలోకి ప్ర‌వేశించాల‌ని అనుకున్నాన‌ని ఉపేంద్ర అన్నారు. తాను చిన్నప్పటి నుంచి దేశ భక్తికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాన‌ని అన్నారు. చిన్న‌ప్ప‌టి నుంచే దేశం అభివృద్ధి కోసం ఆలోచించడం మొదలుపెట్టానని అన్నారు. చిన్న‌ప్పుడు తాను 'కాంపౌండర్ గూండా' అనే నాటకంలో న‌టించాన‌ని అన్నారు. అదే తనలో ఈ మార్పుకి కారణం అయిందని, ఆ పాత్ర‌కి మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News