: జోగేంద్రని అనుకరించిన విక్టరీ వెంకటేశ్‌.. వీడియో చూడండి!


టాలీవుడ్ స్టార్స్ రానా, కాజ‌ల్ న‌టించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు ప్రేక్ష‌కుల‌ నుంచి మంచి ఆద‌ర‌ణ వ‌స్తుండ‌డంతో ఈ సినిమా యూనిట్ మంచి ఖుషీగా వుంది. ఈ సినిమాలో రానా పంచెక‌ట్టు, స్టైల్ అద్భుతంగా వున్నాయంటూ సినీ ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా రానా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో రానా ప‌క్క‌న విక్ట‌రీ వెంక‌టేశ్ ఉన్నాడు. ఇద్ద‌రు హీరోలు పంచెక‌ట్టులో అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. జోగేంద్రలా చేస్తోన్న విక్టరీ వెంకటేశ్‌ని చూడండంటూ రానా పేర్కొన్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

  • Loading...

More Telugu News