: భారత ప్రయాణికులతో అమర్యాదకరంగా ప్రవర్తించిన చైనీస్ ఎయిర్‌లైన్స్
భారత ప్రయాణికులతో షాంఘై పుడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చైనీస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన సత్నమ్ సింగ్ అనే ప్రయాణికుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. తాను ఈ నెల 6న చైనీస్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణిస్తున్న సమయంలో పలువురు భారత ప్రయాణికులను ఎయిర్‌లైన్స్ సిబ్బంది అవమానించారని అన్నారు.
తాను ఈ విషయాన్ని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అయితే, ఆ అధికారులు తనపైనే మండిపడ్డారని చెప్పారు. భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే వారు అలా ప్రవర్తించినట్లు తనకు అర్థమైందని పేర్కొన్నారు. ఆయన చేసిన ఆరోపణలను చైనీస్ ఎయిర్‌లైన్స్ కొట్టి పారేస్తోంది.