: సీటు కోసం గొడవపడి.. ఇద్దరిని రైల్లోంచి తోసేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఒకరి మృతి
సీటు కోసం గొడవపడి ఇద్దరు ప్రయాణికులను కొందరు వ్యక్తులు కదులుతున్న రైల్లోంచి కిందకు తోసేయడంతో వారిలో ఒకరు మృతి చెందిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. న్యూఢిల్లీ-ఆగ్రా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.
రైలు బల్లాబ్గర్, అసావోటి గ్రామానికి చేరుకోగానే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. రెండు నెలల క్రితం ఇదే మార్గంలో ఓ వ్యక్తిని రైల్లోంచి తోసేసి కొందరు హత్య చేశారు. మతోన్మాదంతోనే ఇలా చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రస్తుత ఘటన కూడా అలాంటిదేనా? అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.