: రేపు మహేశ్ బాబు 25వ సినిమా ప్రకటన!
టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు నటించనున్న 25వ చిత్రంపై రేపు ప్రకటన రానుంది. ఆయన చేతిలో ప్రస్తుతం ‘స్పైడర్’, ‘భరత్ అను నేను’ సినిమాలు ఉన్నాయి. అనంతరం మహేశ్ తన 25వ చిత్రంలో నటించనున్నారు. రేపు కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈ చిత్ర వివరాలను మీడియాకు తెలపనున్నారు. మహేశ్ 25వ సినిమాను అశ్వని దత్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ వంశీ పైడిపల్లికి దక్కింది. మహేశ్ బాబు 25వ సినిమా వివరాల ప్రకటన కార్యక్రమానికి ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.