: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర సర్కారు పలు ఆదేశాలు.. వాటికి విరుద్ధంగా మమతా బెనర్జీ ఆదేశాలు
భారతీయ జనతా పార్టీపై మండిపడుతూ ఉండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... తాజాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా తమ రాష్ట్రంలో పలు ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని సర్వ శిక్ష మిషన్ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ఎంహెచ్ఆర్డీ ఆదేశించింది. అందులో భాగంగా పిల్లలకు క్విజ్, వక్తృత్వం పోటీలు, దేశభక్తి నిండిన నినాదాల పోటీలు వంటివి పెట్టాలని చెప్పింది. అలాగే భారతదేశ అభివృద్ధి, సమైక్యత, స్వచ్ఛత ప్రతిజ్ఞలు చేయించాలని పేర్కొంది. అయితే, పశ్చిమ బెంగాల్ సర్కారు మాత్రం ఆ కార్యక్రమాలు ఏవీ నిర్వహించవద్దని ఆదేశించింది.