: భారత్ తొలి ఇన్నింగ్స్: 487 ఆలౌట్


శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 487 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట  ప్రారంభంలోనే భారత జట్టు వికెట్ కోల్పోయింది. ఫెర్నాండో బౌలింగ్ లో దిల్ రువాన్ కు సాహా (16) కు క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగిన అనంతరం, పాండ్యా చెలరేగి ఆడాడు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 103 పరుగులు చేశాడు. రెండో రోజు భోజన విరామ సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 487 పరుగులు చేసింది. విరామం అనంతరం, పాండ్యా సండకాన్ బౌలింగ్ లో దిల్ రువాన్ కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కుల్ దీప్ యాదవ్ (26), షమీ (8), యూటీ యాదవ్ 3 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక బౌలర్లు సండకాన్ 5, పుష్పకుమార 3, ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News