: మేమిద్దరం ప్రేమించుకోవట్లేదు.. ఆ వదంతులు నమ్మకండి!: హీరోయిన్ కాజల్
ప్రముఖ నటుడు రానా, తాను ప్రేమించుకుంటున్నామంటూ వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని హీరోయిన్ కాజల్ స్పష్టం చేసింది. రానా - కాజల్ జంటగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైంది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికతో కాజల్ మాట్లాడుతూ, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామనే వదంతుల్లో ఏ మాత్రం నిజం లేదని, వాటిని నమ్మవద్దని, తామిద్దరం చాలాకాలంగా స్నేహితులమని చెప్పింది.
రానా కష్టపడే వ్యక్తి అని, ‘బాహుబలి’ సినిమాతో రానాకు రావాల్సిన గుర్తింపు అతనికి వచ్చిందని తెలిపింది. ‘బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టారా?’ అనే ప్రశ్నకు కాజల్ జవాబిస్తూ.. టాలీవుడైనా, బాలీవుడైనా తనకు మంచి పాత్ర దొరికితే చేస్తానని, మంచి స్క్రిప్ట్ లభిస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది.