: చివరి టెస్టు రెండో రోజు ఆట.. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా!


శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆటను ప్రారంభించిన కొంచెం సేపటికే టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. విశ్వ ఫెర్నాండో బౌలింగ్ లో వృద్ధిమాన్ సాహా (16) దిల్ రువాన్ కి క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం క్రీజ్ లో పాండ్యా, కులదీప్ కొనసాగుతున్నారు.

టీమిండియా స్కోర్: 102.3 ఓవర్లలో 376/7. కాగా, చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు స్కోరు 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు. 

  • Loading...

More Telugu News